The Real Story
The Gold Standard of Traditional Chilli Powder
Experience the 90s purity in every pinch.
Experience the 90s purity in every pinch.
Memories of Mother & The 90s Purity
"There was always a story of hard work behind the unforgettable taste of my mother’s cooking.
During my childhood in the 90s, the arrival of summer brought a wave of excitement to our home. My mother would spread the vibrant red 341-Grade chillies, brought straight from the fields, across the courtyard to dry. Watching those chillies glisten under the sun was a sight to behold.
But the real work began after that. Mom would gather us all around to hand-pick and remove the stems from every single chilli. I can still hear her voice echoing in my ears, saying, 'If the stem remains, the true flavor of the spice is lost.' After that, she would pound them using a traditional Rokali (pestle) and store the powder in large ceramic jars. The taste of the curries she made and the pickles she prepared with that hand-pounded spice still lingers on my tongue today."
అమ్మ జ్ఞాపకాలు.. 90వ దశకపు స్వచ్ఛత
"అమ్మ చేతి వంటలో ఉండే ఆ రుచి వెనుక ఒక పెద్ద కష్టమే ఉండేది.."
మా చిన్నప్పుడు అంటే 90వ దశకంలో (90s), ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో ఒక పెద్ద హడావిడి మొదలయ్యేది. పొలం నుండి తెచ్చిన ఎర్రటి 341 గ్రేడ్ మిరపకాయలను అమ్మ వాకిట్లో పక్కాగా ఆరబోసేది. ఆ కాయలు ఎండలో మెరుస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు.
కానీ అసలైన పని ఆ తర్వాతే ఉండేది. అమ్మ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని, ప్రతి మిరపకాయకు చేతితో తొడిమెలు తీసేది. "తొడిమ ఉంటే కారం రుచి మారిపోతుందిరా" అని అమ్మ చెప్పే ఆ మాట ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ కాయలను రోకలితో దంచి, ఒక పెద్ద జాడీలో భద్రపరిచేది. ఆ కారం వేసి అమ్మ చేసే కూరలు, పెట్టిన ఊరగాయ పచ్చళ్ల రుచి ఇప్పటికీ నా నాలుక మీదే ఉంది.
"Driven by the desire to preserve the same pure and healthy traditions we’ve followed at home for over 30 years, I founded 'Tirupa'. My goal is to bring the uncompromising quality my mother taught me to every household. With Tirupa, I am bringing the authentic purity of the 90s and my mother's legacy directly to you."
"గడిచిన 30 ఏళ్లుగా మా ఇంట్లో మేము తింటున్న అదే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పద్ధతిని మర్చిపోకూడదని.. అమ్మ నేర్పిన ఆ నాణ్యతను మీ అందరికీ అందించాలన్నదే నా ఆశయం. అందుకే 'తిరుప' (Tirupa) ద్వారా అదే 90s నాటి స్వచ్ఛతను, అమ్మ జ్ఞాపకాలను మీ ముందుకు తెస్తున్నాను."